Andhra Pradesh: వైసీపీ మాస్టర్ ప్లాన్.. ‘అన్న పిలుపు’ పేరుతో తటస్థులకు లేఖలు రాయనున్న జగన్!

  • ఫ్రభావం చూపగల తటస్థులతో సమావేశం
  • సలహాలు, సూచనలు కోరనున్న వైసీపీ అధినేత
  • ఏర్పాట్లు పూర్తిచేసిన ప్రశాంత్ కిశోర్ టీమ్

ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా వైసీపీ అధినేత జగన్ ఇప్పటికే రాష్ట్రమంతా పర్యటించారు. త్వరలోనే మిగిలిన నియోజకవర్గాలను కవర్ చేయడం కోసం బస్సు యాత్రను ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో తటస్థులను ఆకర్షించేందుకు వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలోని 13 జిల్లాల్లో ఓటర్లను ప్రభావితం చేయగల తటస్థ వ్యక్తులకు లేఖలు రాయాలని జగన్ నిర్ణయించారు. ‘అన్న పిలుపు’ అనే పేరుతో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఆయా ప్రాంతాలో తాను చూసిన సమస్యలను ఈ లేఖలో జగన్ వారికి వివరించనున్నారు.

ఈ సమస్యలను పరిష్కరించడానికి కలిసిరావాలనీ, సలహాలు, సూచనలు అందించాలని కోరనున్నారు. జగన్ నియమించుకున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ టీమ్ ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తిచేసింది. ఆయా నియోజకవర్గాల్లో ప్రభావం చూపగలిగి తటస్థంగా ఉన్న వ్యక్తుల వివరాలు సేకరించింది. ఈ నేపథ్యంలోనే జగన్ వారందరికీ లేఖలు రాయనున్నారు. అనంతరం వారందరిని స్వయంగా కలుసుకోనున్నారు. తటస్థులను ఆకర్షించడం ద్వారా వైసీపీ విజయావకాశాలు మరింత మెరుగయ్యే అవకాశం ఉందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

Andhra Pradesh
YSRCP
Jagan
anna pilupu
prasant kishore
letter
neutral
  • Loading...

More Telugu News