Vangaveeti Radha: తాడూ బొంగరం లేనోడిని... చంపేయాలనుకుంటే హ్యాపీగా చంపేసుకోండి: వంగవీటి రాధా

  • కొన్ని వాట్స్ యాప్ గ్రూపులను క్రియేట్ చేశారు
  • నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు
  • తండ్రి ఆశయం కోసం పోరాటం ఆపేది లేదన్న రాధా

గత కొంతకాలంగా కొన్ని వాట్స్ యాప్ గ్రూపుల్లో తనను బెదిరిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు పోస్టులు పెడుతున్నారని ఆరోపించిన వంగవీటి రాధా, తనను చంపేయించదలచుకుంటే ఆ పని చేయించుకోవచ్చని అన్నారు. ఈ ఉదయం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన, "వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు రకరకాల గ్రూపులను క్రియేట్ చేయించారు. కొంతమంది బెదిరింపులు... నిన్ను చంపేస్తాం... నీ అంతు తేలుస్తాం... అంటున్నారు.

నన్ను చంపితే నీకు నిజంగా శాటిస్ ఫాక్షన్ వస్తుందని అనుకుంటే, నన్ను చంపేసేయండి బాబూ... ఎటువంటి... తాడూ బొంగరం లేనోడిని. నాకు అన్నింటికంటే ముఖ్యం ఒకటే. నా తండ్రి ఆశయం. నా తండ్రి పోరాడింది పేద ప్రజలు బాగుండాలనే. పేద ప్రజల పట్టాల కోసమని, ఇళ్ల కోసమని ఆయన ఆనాడు పోరాడారు. ప్రాణాలు అర్పించారు. నన్ను చంపేయాలని అనుకుంటే, నాకెలాంటి ఇదీ లేదు" అని అన్నారు. వైఎస్ జగన్ తన పద్ధతిని మార్చుకుని రంగా అభిమానులను గౌరవించాలని, లేకుంటే విజయవాడ ప్రజలు ఆదరించరని హెచ్చరించారు.

Vangaveeti Radha
Jagan
Vijayawada
  • Loading...

More Telugu News