Vangaveeti Radha: ఇక ఇబ్బందులు, అవమానాలు పడదలచుకోలేదు: వంగవీటి రాధా సంచలన వ్యాఖ్యలు

  • ఇక ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు
  • జగన్ ఇచ్చిన మాట తప్పారు
  • మీడియా సమావేశంలో వంగవీటి రాధ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత కాలమూ తాను అవమానాలు, ఇబ్బందులు పడుతూ కాలం గడిపానని, ఇక అంత అవసరం లేదనిపించిందని వంగవీటి రాధా వ్యాఖ్యానించారు. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన ఆయన, టీడీపీలో చేరనున్న నేపథ్యంలో ఈ ఉదయం మీడియాతో మాట్లాడారు.

తాను పార్టీలో చేరిన సమయంలో వైఎస్ జగన్, తనను సొంత తమ్ముడి కన్నా ఎక్కువగా చూసుకుంటానని హామీ ఇచ్చారని, కానీ, తనను వ్యక్తిగతంగా కించపరుస్తున్న నేతలను సైతం ఆయన వారించలేకపోయారని ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేందుకు గల కారణాలను తాను ఇంతకుముందే మీడియాకు చెప్పానని, తన తండ్రి ఆశయం ముఖ్యమన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు. తన తండ్రి కన్న కలల గురించి జగన్ కు చెప్పిన వేళ, వాటిని నెరవేర్చేందుకు సహకరిస్తానని చెప్పిన ఆయన, తరువాత స్పందించలేదని రాధా వెల్లడించారు.

Vangaveeti Radha
YSRCP
Telugudesam
  • Loading...

More Telugu News