Kotla Vijayabhaskar Reddy: టీడీపీలో చేరనున్న కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి!

  • కాంగ్రెస్ అధిష్ఠానం ఏకపక్ష ధోరణి ప్రదర్శిస్తోందని ఆరోపణ
  • అభిమానులు, అనుచరులతో రేపు కీలక సమావేశం
  • అన్నను విభేదిస్తూ, వైసీపీలో చేరేందుకు హర్ష నిర్ణయం!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత కోట్ల విజయభాస్కరరెడ్డి తనయుడు, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. గత కొంతకాలంగా కాంగ్రెస్ అధిష్ఠానం ఏకపక్ష ధోరణిని అవలంబిస్తోందని ఆరోపణలు చేస్తున్న కోట్ల, తాజాగా, తన అభిమానులు, అనుచరులతో పార్టీ మారే విషయమై చర్చించారు.

నిన్న జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్న పలువురు, కాంగ్రెస్ ను వదిలేసి, తెలుగుదేశం పార్టీలో చేరాలని కోట్ల దంపతులపై ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. దీంతో పార్టీని వీడేందుకు ఆయన సన్నద్ధం అవుతుండగా, ఆపేందుకు ఏపీసీసీ నాయకులు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. రేపు కర్నూలులో కార్యకర్తలతో సమావేశానికి ఏర్పాట్లు చేసుకున్న కోట్ల, ఈ సమావేశం అనంతరం కీలక నిర్ణయం తీసుకుంటారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.  

Kotla Vijayabhaskar Reddy
Harsha
YSRCP
Congress
Telugudesam
  • Loading...

More Telugu News