Andhra Pradesh: చంద్రబాబుపై పలు క్రిమినల్ కేసులు స్టేలో ఉన్నాయి.. ఏపీ హైకోర్టు ప్రారంభోత్సవానికి వెళ్లొద్దు!: సీజేకు జెరూసలేం మత్తయ్య

  • సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ కు లేఖ
  • ఏపీ ముఖ్యమంత్రి ఆహ్వానాన్ని మన్నించవద్దని వినతి
  • ప్రజల్లోకి తప్పుడు సందేశం వెళుతుందని హెచ్చరిక

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ కు ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న జెరూసలేం మత్తయ్య లేఖ రాశారు. ఏపీ హైకోర్టు ప్రారంభోత్సవానికి వెళ్లరాదని మత్తయ్య లేఖలో కోరారు. హైకోర్టు ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు రంజన్ గొగోయ్ ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో మత్తయ్య స్పందిస్తూ.. చంద్రబాబుపై పలు క్రిమినల్ కేసులు స్టేలో ఉన్నాయని లేఖలో తెలిపారు. ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తి ప్రారంభోత్సవానికి వస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని వ్యాఖ్యానించారు. దీనివల్ల న్యాయవ్యవస్థ విశ్వసనీయత దెబ్బతింటుందని హెచ్చరించారు.

Andhra Pradesh
vote for note case
jerusalem mattayya
Chandrababu
ap High Court
inguaration
Supreme Court
cji
ranjan gogoi
  • Loading...

More Telugu News