chiranjeevi: పట్టుబట్టి నయనతారను ఒప్పించిన చరణ్!

- షూటింగు దశలో 'సైరా'
- 'సిద్ధమ్మ'పాత్రలో నయన్
- 'సైరా' ప్రమోషన్స్ కి ఓకే
తమిళనాట స్టార్ హీరోయిన్ గా నయనతార తిరుగులేని స్థానంలో కొనసాగుతోంది. కొన్ని సంవత్సరాలుగా ఆమె చేసిన విభిన్నమైన చిత్రాలు .. అవి సాధించిన విజయాలు నయనతార స్థానాన్ని మరింత పదిలం చేశాయి. ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో నయనతార తెలుగు సినిమాను ఒప్పుకోవడమే గొప్ప విషయంగా మారిపోయింది. అలాంటిది మెగా ప్రాజెక్ట్ కావడంతో ఆమె 'సైరా' చేయడానికి అంగీకరించింది.

నయనతారతో ఆయన నేరుగా మాట్లాడి .. ప్రమోషన్స్ కి ఆమె వస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడట. దాంతో తాను తీసుకున్న నిర్ణయాన్ని పక్కన పెట్టేసి, ఈ సినిమా ప్రమోషన్స్ కి వస్తానని నయనతార చెప్పినట్టుగా సమాచారం. ఇక 'సైరా' ఆడియో రిలీజ్ .. ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికలపై, టీవీ ఛానల్స్ ఇంటర్వ్యూల్లోను నయనతార కనిపించనుందన్న మాట.