anil ravipudi: అనిల్ రావిపూడి నుంచి లేడీ ఓరియెంటెడ్ మూవీ?

  • అగ్ర దర్శకుల జాబితాలో అనిల్ రావిపూడి
  • కొత్త కథపై మొదలైన కసరత్తు
  • నాయిక ప్రాధాన్యత గల కథ అంటూ టాక్  

రాజమౌళి .. త్రివిక్రమ్ శ్రీనివాస్ .. కొరటాల శివ తరువాత స్థానంలో ఇప్పుడు అనిల్ రావిపూడి పేరు వినిపిస్తోంది. కెరియర్ ను ఆరంభించిన దగ్గర నుంచి ఆయన వరుస విజయాలతో తన దూకుడును కొనసాగిస్తున్నాడు. ప్రతిసారి విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. కొత్తదనానికి ఆయన ఇచ్చే ప్రాధాన్యత ఎలా వుంటుందనేది ఇటీవల వచ్చిన 'ఎఫ్ 2' నిరూపించింది.

ఆయన నుంచి 'ఎఫ్ 2' సీక్వెల్ రానుందనీ .. ఆ తరువాత బాలకృష్ణతో ఓ సినిమా వుంటుందనే వార్తలు వచ్చాయి. అయితే ఈ రెండు ప్రాజెక్టులకంటే ముందుగా ఆయన మరో విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకులను పలకరించే అవకాశాలు వున్నాయనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయన ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాకి సంబంధించిన కథపై కసరత్తు చేస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఇంతవరకూ తను చేసిన సినిమాలకి ఇది పూర్తి డిఫరెంట్ గా ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.

anil ravipudi
  • Loading...

More Telugu News