Baba Ram Dev: జనాభా నియంత్రణకు రాందేవ్ బాబా సంచలన సూచన

  • పెరుగుతున్న జనాభాపై ఆందోళన
  •  ఉద్యోగాలు, వైద్య సదుపాయాల్లో నిబంధన విధించాలి
  • అప్పుడే జనాభా నియంత్రణ సాధ్యమవుతుంది

దేశంలో అడ్డుఅదుపు లేకుండా పెరిగిపోతున్న జనాభాను నియంత్రించేందుకు ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ ప్రభుత్వానికి సంచలన సూచన చేశారు. బుధవారం చండీగఢ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. జనాభా పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేశారు. జనాభాను నియంత్రించాలంటే కఠిన చర్యలు తీసుకోవడం తప్పనిసరి అని పేర్కొన్న బాబా రాందేవ్.. ఇద్దరి కంటే ఎక్కువ మంది సంతానం కలిగిన వారికి ఓటు హక్కును తొలగించాలని అన్నారు.

అంతేకాదు, ప్రభుత్వ ఉద్యోగాలు, వైద్య సదుపాయాలు వంటి వాటిని తొలగిస్తేనే జనాభా నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. హిందూ, ముస్లిం భేదాలు లేకుండా ఎవరైనా ఇద్దరి కంటే ఎక్కువ మంది సంతానం కలిగిన వారికి ఇది తప్పనిసరి చేయాలని అభిప్రాయపడ్డారు. అప్పుడే జనాభా నియంత్రణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News