America: అమెరికాలో మళ్లీ గర్జించిన తుపాకి.. ఐదుగురి మృతి

  • ఫ్లోరిడా బ్యాంకులో కాల్పులు
  • ఐదుగురిని పొట్టనపెట్టుకున్న దుండగుడు
  • భయంకర ఘటన అన్న గవర్నర్

అమెరికాలో తుపాకి మరోమారు గర్జించింది. ఫ్లోరిడాలోని ఓ బ్యాంకులో దుండగుడు జరిపిన కాల్పుల్లో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. రాష్ట్రంలోని సెంబ్రింగ్ నగరంలోని సన్‌ట్రస్ట్ బ్యాంకులోకి ప్రవేశించిన యువకుడు విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా మరికొందరు గాయపడ్డారు. నిందితుడిని సెంబ్రింగ్‌కే చెందిన జీపెన్ జావర్ (21)గా గుర్తించారు. దుండగుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నట్టు తెలిపారు.  ప్రాణాలు కోల్పోయిన వారు బ్యాంకు ఉద్యోగులా? ఖాతాదారులా? అనే విషయంలో స్పష్టత లేదు. ఇదో భయంకరమైన ఘటన అని ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్ ఆవేదన వ్యక్తం చేశారు.

America
Florida
Suntrust bank
Gun shoots
Sebring
  • Loading...

More Telugu News