Chandrababu: కాపులకు 5 శాతం రిజర్వేషన్.. చంద్రబాబు ఫ్లెక్సీకి మంత్రి గంటా పాలాభిషేకం

  • చంద్రబాబు నిర్ణయం చారిత్రాత్మకం
  • కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ గొప్ప నిర్ణయం
  • ఉత్తర్వులు వెలువడగానే రిజర్వేషన్ అమలు

కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఇదో చారిత్రాత్మక నిర్ణయమన్నారు. అగ్రవర్ణాల్లోని పేదలకు కేంద్రం 10 శాతం రిజర్వేషన్ ప్రకటిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం అందులో ఐదు శాతాన్ని కాపులకు ప్రకటించడం గొప్ప విషయమన్నారు.

కాపులకు రిజర్వేషన్ ప్రకటించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం విశాఖపట్టణంలోని సర్క్యూట్ హౌస్ వద్ద ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ అవంతి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం కాపు సంఘం నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ..  ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసినప్పటి నుంచి రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయన్నారు.

Chandrababu
Andhra Pradesh
Kapu Reservation
Ganta Srinivasa Rao
Visakhapatnam District
  • Loading...

More Telugu News