Actor krishna: చంద్రబాబుతో నేడు నటుడు కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు భేటీ

  • తెనాలి టికెట్ ఇచ్చేందుకు జగన్ నిరాకరణ
  • పార్టీకి రాజీనామా చేసిన ఆదిశేషగిరి రావు
  • వచ్చే నెలలో టీడీపీలో చేరిక?

ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన సీనియర్ నటుడు కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరి రావు నేడు ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ కానున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన తొలినాళ్లలో ఆదిశేషగిరిరావు కీలకంగా వ్యవహరించారు. రానున్న ఎన్నికల్లో తెనాలి నుంచి పోటీ చేయాలని ఆయన భావించారు. అయితే,  అందుకు నిరాకరించిన జగన్ విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగాలని సూచించినట్టు సమాచారం.

ఈ క్రమంలో, ఆశించిన సీటు దక్కే అవకాశాలు లేకపోవడంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. దీంతో శేషగిరిరావు టీడీపీలో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. వచ్చే నెల 7,8 తేదీల్లో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదిశేషగిరిరావు నేడు చంద్రబాబుతో సమావేశం కానుండడం ఈ వార్తలకు మరింత బలం చేకూరుతోంది.

Actor krishna
Adi seshagiri rao
Telugudesam
YSRCP
Chandrababu
Jagan
  • Loading...

More Telugu News