Kannababu: కాపులను ఇంకా ఎన్ని సార్లు మోసం చేస్తారు?: చంద్రబాబుపై వైసీపీ నేత కన్నబాబు విమర్శలు

  • రిజర్వేషన్లు ఎలా కేటాయిస్తారు?
  • శాస్త్రీయత ఏమైనా ఉందా?
  • ఎన్నిసార్లు మోసం చేస్తారు?

రాజకీయాల్లో ఎంతో సీనియర్ అయిన చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేయడం దారుణమని వైసీపీ నేత కన్నబాబు విమర్శించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు చెప్పినట్టు కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏమైనా అధ్యయనం చేసిందా? లేదంటే దానికి శాస్త్రీయత ఏమైనా ఉందా? అని కన్నబాబు నిలదీశారు.

కాపులను ఇంకా ఎన్ని సార్లు మోసం చేస్తారని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణ పేదలకు కేటాయించిన పదిశాతం రిజర్వేషనల్లో ఐదు శాతం కాపులకు కేటాయించినట్టు చంద్రబాబు హడావుడి చేస్తున్నారని విమర్శించారు. వంద రోజుల్లో ఎన్నికలున్నందున.. ఇప్పటి నుంచే టీడీపీ ప్రజలను మోసం చేయడం ప్రారంభించిందని కన్నబాబు ఆరోపించారు.

Kannababu
Chandrababu
YSRCP
Central Government
Telugudesam
  • Loading...

More Telugu News