Vangaveeti Radha: వంగవీటి రాధాతో టీడీపీ నేతల భేటీ.. తన నిర్ణయాన్ని రేపు వెల్లడిస్తానన్న రాధా!

  • రాధా నివాసానికి టీడీపీ ఎమ్మెల్సీలు
  • చంద్రబాబు సందేశాన్ని అందించామని వెల్లడి
  • టీడీపీలోకి ఆహ్వానించినట్టు స్పష్టం

వైసీపీకి రాజీనామా చేసిన వంగవీటి రాధాకృష్ణ టీడీపీలో చేరడం దాదాపు ఖాయమైపోయింది. నేటి సాయంత్రం టీడీపీ నేతలు బందరు రోడ్డులోని ఆయన నివాసానికి వెళ్లి రాధాతో భేటీ అయ్యారు. రాధాను తమ పార్టీలో చేరాలని ఆహ్వానించారు. రాధాను కలసిన వారిలో టీడీపీ ఎమ్మెల్సీలు టి.డి.జనార్దన్, బచ్చుల అర్జునుడు ఉన్నారు.

భేటీ అనంతరం జనార్దన్ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు సందేశాన్ని రాధాకు అందజేశామని.. అలాగే ఆయన్ను టీడీపీలోకి ఆహ్వానించామని చెప్పారు. దీనిపై తన నిర్ణయాన్ని రాధా రేపు వెల్లడిస్తానన్నారని పేర్కొన్నారు. ఈ నెల 21న రాధా తన అనుచరులతో మాట్లాడిన అనంతరం టీడీపీలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున అనుచరులతో రాధా టీడీపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది.

Vangaveeti Radha
Chandrababu
Janardhan
Arjunadu
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News