Andhra Pradesh: ఏపీ మంత్రి సోమిరెడ్డికి ఝలక్.. వైసీపీలో చేరిపోయిన బావ రామకోటారెడ్డి!

  • కుమారులతో కలిసి వైసీపీ తీర్థం
  • పార్టీలోకి ఆహ్వానించిన జగన్
  • సోమిరెడ్డి అక్కను పెళ్లాడిన రామకోటారెడ్డి

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి గట్టి షాక్ తగిలింది. సోమిరెడ్డి బావ, టీడీపీ నేత కేతిరెడ్డి రామకోటారెడ్డి తన కుమారులతో కలిసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో జగన్ తో ఆయన భేటీ అయ్యారు.

వైసీపీలోకి వచ్చేందుకు ఆసక్తిగా ఉన్న విషయాన్ని ఆయనకు తెలియజేశారు. అవకాశం ఇవ్వాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన జగన్ రామకోటారెడ్డితో పాటు ఆయన కుమారులను కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. రామకోటారెడ్డి సోమిరెడ్డి అక్కను వివాహం చేసుకున్నారు.

Andhra Pradesh
Chandrababu
Telugudesam
somi reddy
brother in law
Minister
YSRCP
Jagan
  • Loading...

More Telugu News