nara lokesh: నేతాజీ సుభాష్ చంద్రబోస్, నారా లోకేష్ ఇద్దరూ ఒకే రోజు పుట్టడం సంతోషకరం: దివ్యవాణి

  • పుట్టినరోజున కూడా రాష్ట్రం కోసం దావోస్ లో పని చేస్తున్నారు
  • తండ్రి నుంచి పొందిన స్ఫూర్తికి ఇది నిదర్శనం
  • చంద్రబాబులాంటి ముఖ్యమంత్రి మనకు దొరకడం అదృష్టం

పుట్టినరోజు నాడు కూడా రాష్ట్రం కోసం దావోస్ లో ఏపీ మంత్రి నారా లోకేష్ పని చేస్తున్నారంటూ టీడీపీ నాయకురాలు, సినీ నటి దివ్యవాణి ప్రశంసించారు. తండ్రి చంద్రబాబు నుంచి పొందిన స్ఫూర్తికి ఇది నిదర్శనమని అన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్, నారా లోకేష్ ఇద్దరూ ఒకే రోజు పుట్టడం సంతోషకరమని చెప్పారు.

చిన్న వయసులోనే అనునిత్యం ప్రజల కోసం కష్టపడుతున్న లోకేష్ పై విపక్షాలు విమర్శలు చేయడం దారుణమని అన్నారు. అగ్రకుల కోటాలో కాపులకు 5 శాతం రిజర్వేషన్ ఇవ్వడం సంతోషకరమని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని... చంద్రబాబులాంటి ముఖ్యమంత్రి మనకు దొరకడం అదృష్టమని తెలిపారు. చంద్రబాబు మరోసారి అధికారంలోకి వస్తేనే రాష్ట్ర అభివృద్ధి కొనసాగుతుందని చెప్పారు.

nara lokesh
Chandrababu
divyavani
tollywood
Telugudesam
netaji
  • Loading...

More Telugu News