sabarimala: నేడు శబరిమల పరిరక్షణ సమితి ‘మహా ఉపవాస దీక్ష’
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-51e2a0fceb4684f42abc5c57d35384f0edce49bb.jpg)
- ఆలయ పవిత్రత కాపాడాలంటూ డిమాండ్
- ఆలయంలోకి మహిళల ప్రవేశంపై అభ్యంతరం
- కొనసాగుతున్న హిందూ సంస్థ నిరసనలు
కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి దేవాలయంలోకి మహిళల ప్రవేశాన్ని నిరసిస్తూ హిందూ సంస్థలు కొనసాగిస్తున్న ఆందోళనల్లో భాగంగా నేడు హైదరాబాద్ లోని ధర్నా చౌక్ వద్ద ‘మహా ఉపవాస దీక్ష’ జరగనుంది. శబరిమల పరిరక్షణ సమితి జాతీయ స్థాయిలో ఇచ్చిన పిలుపు మేరకు స్థానిక హిందూ సంస్థలు ఈ దీక్షలో పాల్గొంటున్నాయి.
ఇటీవల ఇద్దరు మహిళలు తొలిసారి ఆలయంలోకి ప్రవేశించి స్వామి దర్శనం చేసుకోవడం, ఈ విషయం వెల్లడి కావడంతో హిందూ సంస్థలు భగ్గుమనడం, ఆలయంలో సంప్రోక్షణలు నిర్వహించడం తెలిసిందే. అప్పటి నుంచి కేరళ అట్టుడుకుతుండగా, ఇతర ప్రాంతాలకు నిరసనలు విస్తరిస్తున్నాయి. కొన్నిచోట్ల హింసాత్మక సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి.