Janvi Kapoor: ఓ రేంజ్ లో అలరిస్తున్న జాన్వి డ్యాన్స్ ప్రాక్టీస్... వీడియో!

  • శ్రీదేవికి వారసురాలిగా పరిచయమైన జాన్వి
  • త్వరలో జరిగే ప్రోగ్రామ్ కోసం ప్రాక్టీస్
  • వైరల్ అవుతున్న వీడియో

దివంగత నటి శ్రీదేవి ఎంత బాగా నృత్యం చేయగలదో అందరికీ తెలిసిందే. ఆమెకు వారసురాలిగా వచ్చిన జాన్వీ సైతం, తన తొలి చిత్రం 'ధడక్'లో తన డ్యాన్స్ నైపుణ్యాన్ని చూపింది. అందంతో పాటు అభినయంలోనూ పేరు తెచ్చుకున్న ఆమె, త్వరలో పాల్గొనే ఓ కార్యక్రమం కోసం తన కొరియోగ్రాఫర్ తో కలిసి ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను కొరియోగ్రాఫర్ సంజయ్ షెట్టి, తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా, జాన్వి శ్రీదేవిని గుర్తు చేస్తోందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Janvi Kapoor
Sridevi
Instagram
  • Loading...

More Telugu News