Lady: విచారణ పేరిట పోలీసులు కొట్టారంటూ ఇద్దరు యువకుల ఆత్మహత్యా యత్నం.. ఒకరి మృతి!

  • ఇద్దరిపై ఫిర్యాదు ఇచ్చిన యువతి
  • మనస్తాపంతో పోలీసు స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నం
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గండికోట కోటేశ్వరరావు మృతి

తనను వేధిస్తున్నారని ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన పోలీసులు, ఇద్దరు యువకులను అరెస్ట్ చేయగా, తామేం పాపమూ చేయలేదని వాపోయిన వారిద్దరూ ఆత్మహత్యాయత్నం చేయగా, ఒకరు మరణించిన ఘటన కృష్ణా జిల్లాలో కలకలం రేపింది.

  పోలీసులు తమను దారుణంగా హింసించారని ఆరోపిస్తూ, గన్నవరం పోలీస్ స్టేషన్ ఎదుటే ఈ ఇద్దరూ ఆత్మహత్యాయత్నం చేశారు. వీరిలో బుద్ధవరం ప్రాంతానికి చెందిన గండికోట కోటేశ్వరరావు గత రాత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కోటేశ్వరరావు మృతికి పోలీసులే కారణమంటూ ఆయన బంధువులు పోలీసు స్టేషన్ ముందు నిరసనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. తాము కేవలం విచారణ నిమిత్తం పిలిపించామే తప్ప, ఎవరినీ కొట్టలేదని పోలీసులు చెబుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

Lady
Krishna District
Sucide
Police
  • Loading...

More Telugu News