sivakumar swamy: ముగిసిన శివకుమారస్వామి అంత్యక్రియలు... పలువురు నేతలు హాజరు

  • తుముకూరులోని మఠం ఆవరణలో అంత్యక్రియలు
  • అధికారిక లాంఛనాలతో నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం
  • మూడు రోజుల పాటు సంతాప దినాలు

నడిచే దైవంగా పేరుగాంచిన సిద్ధగంగ మఠాధిపతి శివకుమారస్వామి అంత్యక్రియలు భక్తుల అశ్రునయనాల మధ్య ముగిశాయి. అంత్యక్రియలను కర్ణాటక ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించింది. తుముకూరులోని మఠం ఆవరణలోనే అంత్యక్రియలు జరిగాయి. స్వామి వారి చివరి చూపు కోసం పెద్ద ఎత్తున రాజకీయ, సినీ ప్రముఖులు, భక్తులు తరలి వచ్చారు. మాజీ ప్రధాని దేవెగౌడ, ముఖ్యమంత్రి కుమారస్వామి, మాజీ ముఖ్యమంత్రులు యడ్యూరప్ప, సిద్ధరామయ్య, మంత్రి డీకే శివకుమార్ తదితరులు హాజరయ్యారు. ప్రధాని మోదీ తరపున కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చారు. మరోవైపు, స్వామి మృతి నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం మూడు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది.

sivakumar swamy
last rites
siddaganda
  • Loading...

More Telugu News