Allu Arjun: అల్లు అర్జున్‌తో నటించే అవకాశం వచ్చింది కానీ... మిస్ చేసుకున్నా: ప్రియా వారియర్

  • ‘లవర్స్ డే’ ఫిబ్రవరి 14న విడుదల
  • రేపు జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్
  • ముఖ్య అతిథిగా హాజరుకానున్న బన్నీ

మలయాళీ భామ ప్రియా ప్రకాశ్ వారియర్ నటించిన ‘ఒరు అదార్ లవ్’ చిత్రాన్ని తెలుగులో ‘లవర్స్ డే’ పేరుతో ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా రేపు హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ వేడుకకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నాడు. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా ప్రియ‌ నేడు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

అల్లు అర్జున్‌ సినిమాలో నటించే అవకాశం ఆమధ్య తనకు వచ్చిందని.. కానీ మిస్‌ చేసుకున్నానని తెలిపింది. అలాగే తనకు ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ నోటీసులు పంపిన విషయమై స్పందించిన ప్రియ.. ‘నా రెండో సినిమా ‘శ్రీదేవి బంగ్లా’ ట్రైలర్‌ ఇటీవల విడుదలైంది. ఈ సినిమా విషయంలో నాకు నిర్మాత బోనీ కపూర్‌ నుంచి నోటీసులు రాలేదు. వివాదం గురించి దర్శక, నిర్మాతలు చూసుకుంటారు’ అని తెలిపింది.

Allu Arjun
Priya Warrior
Oru ADar Love
Sridevi Bunglow
Boni kapoor
  • Loading...

More Telugu News