Nara Lokesh: ఈ నెలాఖరులో డేటా సెంటర్ పార్క్‌కు భూమి పూజ

  • అదాని గ్రూప్ ఎండీతో లోకేశ్ సమావేశం
  • కనెక్టెడ్ స్మార్ట్ సిటీ ఏర్పాటుకి సహకారం
  • డేటా పార్క్ పనులు వేగంగా పూర్తి చేస్తాం

అదానీ గ్రూప్ ఎండీ అనిల్ సార్దానాతో ఏపీ మంత్రి లోకేశ్ నేడు సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఏపీలో డేటా సెంటర్ పార్కును అదానీ గ్రూప్ ఏర్పాటు చేయనుందని.. ఈ నెలాఖరులో డేటా సెంటర్ పార్కుకు భూమి పూజ చేయనున్నామని స్పష్టం చేశారు. కనెక్టెడ్ స్మార్ట్ సిటీ ఏర్పాటుకి అదానీ గ్రూప్ సహకారం అందిస్తుందన్నారు. డేటా పార్క్ పనులు వేగంగా పూర్తి చేసేందుకు సహకారమిస్తామని.. అమరావతిలో డిస్ట్రిక్ట్ కూలింగ్ ఏర్పాటు చేస్తామని లోకేశ్ తెలిపారు.

Nara Lokesh
Anil Sardana
Adani Group
Data Centre Park
Amaravathi
  • Loading...

More Telugu News