sensex: ఐఎంఎఫ్ ఎఫెక్ట్.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు తగ్గబోతోందన్న ఐఎంఎఫ్
  • ప్రాఫిట్ బుకింగ్ చేసిన ఇన్వెస్టర్లు
  • 134 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

రానున్న రోజుల్లో ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు తగ్గబోతోందంటూ ఐఎంఎఫ్ ప్రకటించడంతో... దాని ప్రభావం గ్లోబల్ మార్కెట్లపై పడింది. దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా ప్రభావితమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి బ్యాంకింగ్, ఐటీ, ఆటోమొబైల్, మెటల్స్ రంగాల షేర్లలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీంతో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 134 పాయింట్లు కోల్పోయి 36,445కు పడిపోయింది. నిఫ్టీ 39 పాయింట్లు నష్టపోయి 10,923 వద్ద స్థిరపడింది. బీఎస్ఈలో హీరో మోటోకార్ప్, బజాజ్ ఫైనాన్స్, కొటక్ మహీంద్రా బ్యాంక్, సన్ ఫార్మా, హిందుస్థాన్ తదితర సంస్థలు లాభపడ్డాయి. మారుతి సుజుకి, మహీంద్రా అండ్ మహీంద్రా, వేదాంత లిమిటెడ్, టాటా స్టీల్, భారతీ ఎయిర్ టెల్ తదితర కంపెనీలు నష్టపోయాయి.

  • Loading...

More Telugu News