Andhra Pradesh: ధిక్కారంపై వేటు.. మేడా మల్లికార్జున రెడ్డిని సస్పెండ్ చేసిన సీఎం చంద్రబాబు!

  • చంద్రబాబుకు రాజంపేట నేతల ఫిర్యాదు
  • పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ
  • తీవ్రంగా పరిగణించిన టీడీపీ అధినేత

ప్రతిపక్ష వైసీపీలోకి చేరాలని నిర్ణయించుకున్న రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కొరడా ఝుళిపించారు. మేడాతో పాటు ఆయన అనుచరులు, మద్దతుదారులను టీడీపీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈరోజు కడప జిల్లాలోని రాజంపేట, జమ్మలమడుగు నియోజకవర్గాల నేతలతో బాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మేడా వ్యవహారశైలిపై పార్టీ నేతలు, కార్యకర్తలు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు.

అధికార పార్టీలో ఉంటూ విపక్ష వైసీపీ నేతలతో రాసుకుపూసుకు తిరుగుతున్న విషయాన్ని అధినేత దృష్టికి తీసుకెళ్లారు. అమరావతిలో ఈరోజు సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానించినప్పటికీ రాకపోవడాన్ని సీఎం తీవ్రంగా పరిగణించారు. మేడాతో పాటు ఆయన అనుచరులను సస్పెండ్ చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీచేశారు. 

Andhra Pradesh
Telugudesam
YSRCP
Chandrababu
Kadapa District
Jagan
meda
mallikarjuna reddy
suspend
mla
join
rajampeta
  • Loading...

More Telugu News