Andhra Pradesh: నాన్నగారు రాలేకపోయారు.. అందుకే నేనొచ్చా.. ప్రపంచదేశాలకు ఏపీ అభివృద్ధిని చూపిస్తా!: లోకేశ్

  • కొన్ని కారణాలతో చంద్రబాబు రాలేకపోయారు
  • ఐదు రోజుల పాటు సాగనున్న సదస్సు
  • ట్విట్టర్ లో స్పందించిన టీడీపీ నేత

స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) సదస్సులో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబుకు బదులుగా ఐటీ మంత్రి నారా లోకేశ్ బయలుదేరిన సంగతి తెలిసిందే. తాజాగా తాను దావోస్ కు చేరుకున్నట్లు నారా లోకేశ్ తెలిపారు. కొన్ని ముఖ్యమైన కారణాలతో గౌరవనీయులైన ఏపీ సీఎం చంద్రబాబు గారు అమరావతిలోనే ఉండాల్సి వచ్చిందన్నారు. ఈ నెల 21 నుంచి
ఐదు రోజుల పాటు దావోస్ సదస్సు సాగనుంది.

ఆయనకు బదులుగా తాను దావోస్ భేటీలో పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రతిష్టాత్మక సదస్సు సందర్భంగా ఏపీలో జరిగిన గొప్ప అభివృద్ధిని ప్రపంచదేశాల దృష్టికి తీసుకెళ్లేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్ చేసిన లోకేశ్ దావోస్ సదస్సుకు సంబంధించిన పలు ఫొటోలను పోస్ట్ చేశారు.

Andhra Pradesh
Chandrababu
Telugudesam
Nara Lokesh
davos
sitzerland
  • Loading...

More Telugu News