devadas kanakala: అప్పటి నుంచీ నా కష్టాలు, బాధలను చీకట్లోనే చెప్పుకుంటాను: దేవదాస్ కనకాల

  • లక్ష్మిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను
  • 48 యేళ్ల వైవాహిక జీవితం
  • ఆమె సహకారం మరిచిపోలేనిది

ఏడాది క్రితం దేవదాస్ కనకాల భార్య లక్ష్మీ కనకాల చనిపోయారు. ఆమెకి సంబంధించిన ప్రస్తావన 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో వచ్చింది. ఆమె గురించి దేవదాస్ కనకాల మాట్లాడుతూ .. "లక్ష్మిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను .. నిజానికి నా కంటే తను 6 యేళ్లు పెద్ద. ఆమె కూడా చాలా అద్భుతంగా నటిస్తుంది.


నా కెరియర్ విషయంలో ఆమె నాకు ఎంతగానో సహకరించింది. నట శిక్షణాలయం నిర్వహణ విషయంలో ఆమె తోడ్పాటు మరిచిపోలేనిది. 48 సంవత్సరాలపాటు మా వైవాహిక జీవితం కొనసాగింది. తను బతికున్నంత వరకూ నా కష్టాలు .. బాధలు ఆమెతోనే పంచుకునేవాడిని. తను చనిపోయిన తరువాత నా బాధలను రాజీవ్ తో గానీ .. సుమతో గాని చెప్పను .. వాళ్ల జీవితాలు వాళ్లవి. మనసుకు బాధ కలిగితే చీకట్లో చెప్పుకుంటున్నాను .. తను చీకట్లోనే కదా ఉంటుంది" అని ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు.

devadas kanakala
ali
  • Loading...

More Telugu News