Vijay Devarakonda: ఈ చిన్నోడు ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే... తెగ వైరల్ అవుతున్న వీడియో!

  • సెన్సేషనల్ స్టార్ గా ఎదిగిన విజయ్ దేవరకొండ
  • చిన్న వయసులో షావుకారు జానకితో కలిసి నటించిన విజయ్
  • అభిమాని పెట్టిన వీడియోకు కృతజ్ఞతలు చెప్పిన విజయ్

గుండ్రని ముఖంతో ముద్దులొలికేలా ఉన్న ఈ పిల్లాడిని చూస్తే ఎక్కడో చూసినట్టే ఉందికదూ? ఎవరో కాదు, టాలీవుడ్ నయా సెన్సేషన్ విజయ్ దేవరకొండ. 'అర్జున్ రెడ్డి', 'గీతగోవిందం' సినిమాలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ చిన్నప్పటి వీడియో ఒకటి తాజాగా బయటకు వచ్చి సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.

ఇక ఈ వీడియో 1999 సమయంలోది. అప్పట్లో షావుకారు జానకితో కలిసి విజయ్, ఓ టీవీ సీరియల్ లో నటించాడు. దీన్ని సంపాదించిన ఓ అభిమాని, విజయ్‌ దేవరకొండను ట్యాగ్ చేస్తూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. దీన్ని చూసిన విజయ్, వీడియోను పోస్టు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపాడు. విజయ్ చిన్నప్పటి వీడియోను మీరూ చూడండి.



Vijay Devarakonda
Old Video
Twitter
  • Loading...

More Telugu News