anurag: రొమాంటిక్ ఎంటర్టైనర్ గా 'మళ్లీ మళ్లీ చూశా' .. టీజర్ రిలీజ్

  • మరో ప్రేమకథా చిత్రంగా 'మళ్లీ మళ్లీ చూశా'
  • దర్శకుడిగా సాయిదేవ రమణ్ పరిచయం 
  • ఆకట్టుకుంటోన్న సంభాషణలు    

తెలుగు తెరపై రొమాంటిక్ ఎంటర్టైనర్లు సందడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మరో ప్రేమకథా చిత్రం ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది. 'మళ్లీ మళ్లీ చూశా' అనే పేరుతో ఈ సినిమా నిర్మితమవుతోంది. అనురాగ్ ..శ్వేత జంటగా నటిస్తోన్న ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ వచ్చింది. దర్శక నిర్మాతలు సాయిదేవ రమణ్ .. కోటేశ్వరరావు ఈ టీజర్ ను ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు చేతుల మీదుగా లాంచ్ చేయించారు.

టైటిల్ కి తగినట్టుగానే ప్రేమ భావనలకు సంబంధించిన సన్నివేశాలపై ఈ టీజర్ ను కట్ చేశారు. " పక్షులు ఆకాశంలోనే ఎగరాలి .. ఆడిటోరియంలో కాదు. అలాగే మనుషులు కూడా మనస్ఫూర్తిగానే బతకాలి .. మనీస్ఫూర్తిగా కాదు" .. "కడలి అలను .. కాలం పరుగును .. మనసు స్వేచ్ఛను ఎవరూ ఆపలేరు" అనే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. శ్రవణ్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

anurag
swetha
  • Error fetching data: Network response was not ok

More Telugu News