Akkineni Nageshwararao: ఐదేళ్లయినా నిన్ను మరువలేకున్నాం నాన్నా: నాగార్జున

  • నేడు అక్కినేని నాగేశ్వరరావు ఐదో వర్ధంతి
  • ట్విట్టర్ ద్వారా బాధను వెలిబుచ్చిన నాగార్జున
  • నేడు అభిమాన సంఘాల సేవా కార్యక్రమాలు

నేడు అక్కినేని నాగేశ్వరరావు ఐదో వర్ధంతి కాగా, ట్విట్టర్ ద్వారా తనలోని బాధను వెలిబుచ్చారు హీరో నాగార్జున. "మీరు మమ్మల్ని వీడి ఐదు సంవత్సరాలు అయింది. మేము ఆనందంగా ఉండేలా చేశారు మీరు. మేము మీ గురించే తలచుకుంటున్నాం. నిన్నెంతో ప్రేమిస్తున్నాం. నిన్ను మరువలేకున్నాం నాన్నా... మీ అభిమానులందరు మరియు కుటుంబం" అని ట్వీట్ చేశారు.

కాగా, తన సినీ కెరీర్ లో 255 చిత్రాల్లో నటించి, దాదా సాహెబ్ ఫాల్కే, పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ తదితర ఎన్నో పురస్కారాలను అందుకున్న అక్కినేని నాగేశ్వరరావు, 2014, జనవరి 22న దివంగతులైన విషయం తెలిసిందే. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా పలు అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి.



Akkineni Nageshwararao
Nagarjuna
Twitter
  • Loading...

More Telugu News