Andhra Pradesh: ‘మేడా’ వ్యవహారంపై చంద్రబాబుతో చర్చిస్తాం.. ఈరోజు అమరావతికి రావాలని చెప్పాం!: మంత్రి సోమిరెడ్డి

  • ఒకేసారి రెండు విడతల రుణమాఫి
  • రైతులకు రూ.2 వేల కోట్ల సాయం
  • అమరావతిలో మీడియాతో మంత్రి

ఆంధ్రప్రదేశ్ లో రైతులకు మిగిలిన రెండు విడతల రుణమాఫీని ఒకేసారి అందిస్తామని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. పెట్టుబడి రాయితీ కింద రైతుల కోసం రూ.2,000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నామని చెప్పారు. రైతులకు మరిన్ని మేళ్లు చేకూర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. అమరావతిలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో సోమిరెడ్డి మాట్లాడారు.

రాజంపేటలో టీడీపీ నేతలు వర్సెస్ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి వ్యవహారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చిస్తామని మంత్రి తెలిపారు. ఈరోజు ముఖ్యమంత్రితో భేటీ కావడానికి రావాల్సిందిగా మేడాకు సమాచారం అందించామని అన్నారు. మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలు పాటిస్తారని స్పష్టం చేశారు.

Andhra Pradesh
Chandrababu
Telugudesam
somi reddy
meda
mallikarjun reddy
  • Loading...

More Telugu News