KCR: పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోని కేసీఆర్!

  • చింతమడకలో కేసీఆర్ దంపతులకు ఓటు
  • నిన్న చండీయాగంలో బిజీగా ఉన్న కేసీఆర్
  • అందువల్లే ఓటు వేయలేకపోయారన్న టీఆర్ఎస్ వర్గాలు

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన సతీమణి శోభ తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. తన స్వగ్రామమైన సిద్దిపేట రూరల్‌ మండలం చింతమడకలో ఓటు హక్కును కేసీఆర్ కలిగివున్న సంగతి తెలిసిందే.

ఇక చింతమడక గ్రామ పంచాయతీకి తొలి విడతలోనే ఎన్నిక ముగిసింది. అయితే, తన వ్యవసాయ క్షేత్రంలో జరుగుతున్న సహస్ర మహా చండీయాగంలో నిమగ్నమై ఉన్నందునే కేసీఆర్ దంపతులు సోమవారం జరిగిన ఎన్నికల్లో ఓటును వేయలేకపోయారు. సరిగ్గా యాగం ప్రారంభమైన సమయంలోనే ఓటింగ్ జరగడంతోనే ఆయన వెళ్లలేకపోయారని టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. కాగా, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ చింతమడక గ్రామానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్న సంగతి తెలిసిందే.

KCR
Chintamadaka
Telangana
Gram Panchayat
Elections
Vote
  • Loading...

More Telugu News