ICC: ధోనీకి అరుదైన గౌరవం.. ఐసీసీ ‘ట్విట్టర్’ కవర్ పేజీపై ధోనీ ఫొటో!

  • ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుతంగా రాణించిన ధోనీ 
  • అందుకే, ధోనీని ఇలా గౌరవిస్తున్నాం
  • ధోనీ అభిమానుల సంతోషం

ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుతంగా రాణించిన టీమిండియా క్రికెటర్ ధోనీకి అరుదైన గౌరవం దక్కింది. ఐసీసీ అధికారిక ట్విట్టర్ ఖాతా పేజీలో ధోనీ ఫొటోను ఉంచింది. ఆస్ట్రేలియాలో ఓ రేంజ్ లో రాణించినందుకు ధోనీకి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ దక్కినందుకు గుర్తుగా ఆయన ఫొటోను తమ కవర్ పేజీగా ఉంచినట్టు ఐసీసీ పేర్కొంది. ఇక, ధోనీ అభిమానుల సంతోషానికైతే అవధుల్లేవు. ధోనీ ఆటతీరును ఐసీసీ గుర్తించిందని, ఆయనపై విమర్శలు గుప్పించినోళ్లు ఇకనైనా మేల్కోవాలని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

ICC
Team India
cricketer
dhoni
Australia
  • Loading...

More Telugu News