Swine Flu: గాంధీ ఆసుపత్రిలో ఐదుగురు స్వైన్ ఫ్లూ బాధితులు!

  • నలుగురిది హైదరాబాద్.. ఒకరిది ఖమ్మం
  • ఆసుపత్రిలోని ప్రత్యేక వార్డులో చికిత్స
  • వాతావరణ మార్పులే కారణమని వెల్లడి

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో నేడు ఐదు స్వైన్ ఫ్లూ కేసులు నమోదు కావడంతో ఒక్కసారిగా రాష్ట్రంలో కలకలం రేగింది. స్వైన్‌ఫ్లూ బాధితుల్లో నలుగురు హైదరాబాద్‌కు చెందిన వారు కాగా.. ఒకరు ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తిగా వైద్యులు తెలిపారు. ఐదుగురిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. వీరికి ఆసుపత్రిలోని ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు. వాతావరణంలోని మార్పులే స్వైన్ ఫ్లూకి కారణమని వైద్యులు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Swine Flu
Gandhi Hospital
Hyderabad
Khammam
Climate Changes
  • Loading...

More Telugu News