janasena: ‘జనసేన’లో చేరిన ఆకుల సత్యనారాయణ.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్

  • ‘జనసేన’లో చేరిన ఆకుల దంపతులు
  • ఆకుల కుటుంబానికి ప్రత్యేక గౌరవం ఉంది
  • ఈ చేరికతో ‘జనసేన’ మరింత బలోపేతమైంది

రాజమండ్రి అర్బన్ బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, ఆయన భార్య ఆకుల లక్ష్మీ పద్మావతి జనసేన పార్టీలో ఈరోజు చేరారు. ఈ సందర్భంగా విజయవాడలో కార్యక్రమం నిర్వహించారు. సత్యనారాయణ, లక్ష్మీ పద్మావతిలకు  జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అంతకుముందు, పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గానికి చెందిన మత్స్యకార సంఘం నాయకుడు బొమ్మిడి నాయకర్ తన అనుచరులతో కలిసి జనసేన పార్టీలో చేరారు. నాయకర్ సహా ఆయన అనుచరులకు ‘జనసేన’ కండువాలను కప్పి పార్టీలోకి పవన్ ఆహ్వానించారు.
ఆకుల కుటుంబం పార్టీకి అండగా ఉండి ప్రోత్సహిస్తుంది: పవన్ కల్యాణ్

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, తూర్పుగోదావరి జిల్లాలో ఆకుల సత్యనారాయణ కుటుంబానికి ప్రత్యేక గౌరవం ఉందని, అలాంటి కుటుంబం ‘జనసేన’లో చేరడం వల్ల పార్టీ మరింత బలోపేతమైందని సంతోషం వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల సమయంలో పొత్తులో భాగంగా ఆకుల సత్యనారాయణకు తాను మద్దతు ఇచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఆకుల కుటుంబం జనసేన పార్టీకి అండగా ఉండి ప్రోత్సహిస్తుందని ఆకాంక్షించారు. ఆకుల దంపతులను మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నానని అన్నారు.

janasena
Pawan Kalyan
bjp
aakula satyanarayana
Vijayawada
rajahmundry
aakula lakshmi padmavati
  • Loading...

More Telugu News