Rajendra Prasad: రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని మాట్లాడే వారికి ఓపెన్ ఛాలెంజ్!: టీడీపీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్

  • తలసానివి దిగజారుడు మాటలు
  • ఎన్నికల్లో ఎలా గెలిచారో అర్థం కావట్లేదు
  • అలాంటి వ్యక్తులు రాజకీయాలకు పనికి రారు

'రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని మాట్లాడే వారికి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా'నని తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. గుంటూరులో నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తలసాని శ్రీనివాస్ ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ ఎన్నికల్లో గెలిచిన మాజీ మంత్రులు ఏపీలో మాట్లాడిన మాటలు వింటుంటే వారు ఎన్నికల్లో ఎలా గెలిచారో అర్థం కావట్లేదన్నారు. తలసాని మాట్లాడే విధానాన్ని మార్చుకోవాలని.. నీతి నిజాయతీల్లేని వ్యక్తులు రాజకీయాలకు పనికి రారని ఆలపాటి హితవు పలికారు.

Rajendra Prasad
Thalasani Srinivas
Telugudesam
Guntur
Andhra Pradesh
  • Loading...

More Telugu News