TRS: తెలంగాణా పంచాయతీ ఎన్నికలు: 'కారు' జోరు.. విజయకేతనం ఎగురవేస్తున్న టీఆర్ఎస్ మద్దతుదారులు

  • 1264 స్థానాల్లో టీఆర్ఎస్ విజయం
  • కాంగ్రెస్ 276, టీడీపీ 6 చోట్ల విజయం
  • పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు

పంచాయతీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా వెలువడుతున్న తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతుదారులు సత్తా చాటుతున్నారు. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల్లో టీఆర్ఎస్ మద్దతుదారులు 1264 స్థానాల్లో గెలుపొందగా.. కాంగ్రెస్ 276 స్థానాల్లోనూ.. టీడీపీ 6, బీజేపీ 19, సీపీఐ 6, సీపీఎం 8, ఇతరులు 288 స్థానాల్లో విజయం సాధించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పోలింగ్ జరిగింది. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమైంది.

TRS
Congress
CPI
CPM
BJP
Telugudesam
  • Loading...

More Telugu News