Yanamala: రేపటి నుంచి ప్రీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్న యనమల

  • బడ్జెట్ రూపకల్పనపై సమావేశం
  • 4 రోజుల పాటు ప్రీ బడ్జెట్ సమావేశాలు
  • అన్ని శాఖల అధికారులతో చర్చ

రేపటి నుంచి నాలుగు రోజుల పాటు ఆర్థిక మంత్రి యనమల ఆయా శాఖల అధికారులతో ప్రీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా నేడు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో బడ్జెట్ రూపకల్పనపై ఆయన సమావేశమయ్యారు. మంగళవారం.. వ్యవసాయ, పౌర సరఫరా,  బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళా శిశు సంక్షేమ శాఖాధికారులతో మంత్రి సమావేశం కానున్నారు.

బుధవారం హోం, పరిశ్రమలు, రెవెన్యూ, అటవీ, విద్యుత్, మునిసిపల్ శాఖాధికారులతోనూ.. గురువారం నాడు మానవ వనరులు, పంచాయతీరాజ్, ఆర్అండ్‌బీ, ఇరిగేషన్, ఆరోగ్య శాఖాధికారులతో.. శుక్రవారం ఐటీ, ప్రణాళిక, సమాచార, పర్యాటక శాఖాధికారులతో యనమల సమావేశం కానున్నారని అధికారులు తెలిపారు. ఈ ప్రీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన అనంతరం బడ్జెట్ రూపకల్పన విషయమై యనమల తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం.

Yanamala
Budget Meeting
Revenue
IT
Power
Municipal
Agricultural
  • Loading...

More Telugu News