YSRCP: వంగవీటి రాధాకృష్ణ రాజీనామాకు నేను కారణం కాదు!: మల్లాది విష్ణు

  • ఈస్ట్ నుంచి పోటీ చేయాలని జగన్ సూచించారు
  • రాధ మంచి కోసమే అలా చెప్పారు
  • మీడియాతో మాట్లాడిన వైసీపీ నేత

వంగవీటి రాధాకృష్ణ మంచి కోసమే విజయవాడ ఈస్ట్ నుంచి పోటీ చేయాలని వైసీపీ అధినేత జగన్ సూచించారని ఆ పార్టీ నేత మల్లాది విష్ణు తెలిపారు. తాను వైసీపీలో బేషరతుగా చేరానని గుర్తుచేశారు. పార్టీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. విజయవాడలో ఈరోజు మల్లాది విష్ణు ఓ టీవీ ఛానల్ తో మాట్లాడారు.

వైసీపీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని టీడీపీ నేతలు విమర్శించడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని వ్యాఖ్యానించారు. వంగవీటి రాధాకృష్ణకు సీటు లేదని వైసీపీ ఎన్నడూ చెప్పలేదని తేల్చిచెప్పారు. విజయవాడ తూర్పు నుంచి పోటీ చేయాలని మాత్రమే అధినేత సూచించారన్నారు. తన వల్ల రాధా వైసీపీ నుంచి బయటకు వెళ్లారన్న వాదన సరికాదని తేల్చిచెప్పారు.

YSRCP
Vijayawada
maklladi vishnui
vangaveeti
radhakrishna
Andhra Pradesh
Vijayawada east
Vijayawada central
assembly seat
resign
  • Loading...

More Telugu News