Andhra Pradesh: టీడీపీలోనే నాకు శత్రువులు ఉన్నారు..సీఎంకు తప్పుడు రిపోర్టులు పంపారు!: మంత్రి అఖిలప్రియ

  • సమస్యను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లా
  • ఆయన లేకుంటే ఈరోజు నేను లేను
  • మీడియాతో మాట్లాడిన ఏపీ మంత్రి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని టీడీపీ నేత, మంత్రి భూమా అఖిలప్రియ తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏపీలో సీఎం చంద్రబాబు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారని ప్రశంసించారు. రాబోయే ఎన్నికల్లో మరోసారి టీడీపీనే అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. తాను టీడీపీని విడిచిపెట్టి బయటకు వెళతానన్న ప్రచారంలో వాస్తవం లేదని తేల్చిచెప్పారు. చంద్రబాబు సపోర్ట్ లేకుంటే ఈరోజు తానిక్కడ ఉండేదాన్ని కాదని వ్యాఖ్యానించారు. ఈరోజు ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అఖిలప్రియ మాట్లాడారు.

ఏదైనా సమస్య ఉంటే సీఎంతో మాట్లాడి పరిష్కరించుకుంటాననీ, అంతేతప్ప పార్టీని విడిచిపెట్టి పోనని స్పష్టం చేశారు. సొంత పార్టీలోనే తనకు శత్రువులు ఉన్నారని అఖిల ప్రియ బాంబు పేల్చారు. ఈ విషయాలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. కావాలనే ఆళ్లగడ్డపై చంద్రబాబుకు తప్పుడు రిపోర్టులు పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీనివెనుక పోలీసులు ఉన్నారా? లేక ఇంటెలిజెన్స్ అధికారులు ఉన్నారా? అన్నది తనకు తెలియదన్నారు. తనను టార్గెట్ చేయాలని చాలామంది చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తాను, సోదరుడు బ్రహ్మానంద రెడ్డి తొలిసారి ఎన్నికలను ఎదుర్కొంటున్నందున చంద్రబాబు తమపై చాలా శ్రద్ధ తీసుకుంటున్నారనీ, గైడ్ చేస్తున్నారని పేర్కొన్నారు.

Andhra Pradesh
Telugudesam
bhuma
akhila priya
enemy
own party
Chief Minister
Chandrababu
Minister
Police
  • Loading...

More Telugu News