Karnataka: గుడిలో సింపుల్ గా పెళ్లి చేసుకున్న రంజీ క్రికెటర్, కన్నడ హీరోయిన్!

  • మడికేరి గుడిలో పెళ్లి
  • కొడవ సంప్రదాయంలో ఒకటైన ఎన్సీ అయ్యప్ప, అనుపువ్వమ్మ
  • రిసెప్షన్ కు హాజరైన ప్రముఖులు

రంజీ క్రికెటర్ ఎన్సీ అయ్యప్ప, కన్నడ నటి అనుపువ్వమ్మ ఓ చిన్న గుడిలో అత్యంత నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. వీరిద్దరి నిశ్చితార్థం గత సంవత్సరం మేలో జరుగగా, తాజాగా వీరి పెళ్లి మడికేరిలో కొడవ సంప్రదాయంలో జరిగింది. ఆపై ఈ జంట రిసెప్షన్ ఇవ్వగా, పలువురు శాండల్ వుడ్ ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. గడచిన మూడేళ్లుగా ప్రేమలో ఉన్న వీరు ఇప్పటికి ఒకటయ్యారు. అయ్యప్ప క్రికెటర్ గా, బిగ్ బాస్ రియాల్టీ షో కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకోగా, అనుపువ్వమ్మ పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.

Karnataka
Sandalwood
NC Ayyappa
Anupuvamma
Marriage
  • Loading...

More Telugu News