priya varrier: ప్రియా వారియర్ 'లవర్స్ డే' చీఫ్ గెస్టుగా అల్లు అర్జున్

- మలయాళంలో 'ఒరు ఆదార్ లవ్'
- తెలుగు అనువాదంగా 'లవర్స్ డే'
- ఫిబ్రవరి 14వ తేదీన సినిమా విడుదల
మలయాళంలో 'ఒరు ఆదార్ లవ్' సినిమా చేస్తుండగానే .. ప్రియా వారియర్ కి విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. దాంతో మలయాళంతోపాటు తమిళ .. తెలుగు .. హిందీ భాషల నుంచి ఆమెకి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఆమె డేట్స్ కోసం చాలామంది దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో 'ఒరు ఆదార్ లవ్' అనే సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు అనువాదంగా తీసుకురానున్నారు.
