Hyderabad: ఇద్దరు చెడ్డీగ్యాంగ్ సభ్యులను అరెస్టు చేసిన సైబరాబాద్ పోలీసులు
- ఇటీవల శివారు ప్రాంతాల్లో దొంగతనాలతో హడలెత్తించిన గ్యాంగ్
- తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు
- సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా దొరికిన నిందితులు
పండుగ రోజుల్లో హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడి అలజడి సృష్టించిన చెడ్డీగ్యాంగ్ సభ్యుల్లో ఇద్దరిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఇళ్లకు తాళం వేసి సొంతూర్లకు ఎక్కువ మంది వెళ్లే అవకాశం ఉండడంతో దీన్ని ఆసరాగా చేసుకుని చెడ్డీగ్యాంగ్, ఇరానీగ్యాంగ్ సభ్యులు నగరంలో తిష్టవేశాయి. కొంతకాలంగా ఈ ముఠా సభ్యులు రాత్రిపూట వరుస దొంగతనాలకు పాల్పడుతూ హడలెత్తించారు. అడ్డొచ్చిన వారిని గాయపరించేందుకు కూడా వెనుకాడలేదు. అటెన్షన్ డైవర్షన్‌తో దోపిడీలు చేస్తూ బీభత్సం సృష్టించారు.
దీంతో అలెర్టయిన సైబరాబాద్ కమిషనర్ ఈ అంతర్రాష్ట్ర దొంగల ముఠా కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వీరు చోరీలకు ప్పాడిన ప్రాంతాల్లో సీసీ కెమెరాల్లో నమోదైన పుటేజీ ఆధారంగా వీరిపై నిఘా పెట్టారు. ఇద్దరు సభ్యులు చిక్కడంతో వారిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో నగదు, నగలు రికవరీ చేశారు.