vigilance: పల్టీ కొట్టిన కారు.. మహిళా సీఐకు తీవ్ర గాయాలు

  • సంగారెడ్డి జిల్లాలో విజిలెన్స్ సీఐగా పని చేస్తున్న నిర్మల
  • నాగారం నుంచి తిరుమలగిరి వెళ్తుండగా ప్రమాదం
  • కారులోని ముగ్గురు చిన్నారులకు స్వల్ప గాయాలు

సూర్యాపేట జిల్లా నాగారం మండల పరిధిలోని నాగారం బంగ్లా వద్ద నిన్న తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సంగారెడ్డి జిల్లాలో విజిలెన్స్ సీఐగా పని చేస్తున్న నిర్మల తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళ్తే, సీఐ నిర్మల తన తల్లి స్వస్థలమైన నాగారానికి వచ్చి... తన సొంత పనిపై తిరుమలగిరివైపు కారులో వెళ్తున్నారు. కారులో ఆమె కుమార్తె జాజి, అల్లుడు చింటు, చెల్లి కొడుకు సుహాన్ లు ఉన్నారు. ఈ క్రమంలో కారు నాగారం బంగ్లా శివారులోని రైస్ మిల్లు వద్దకు వచ్చిన తర్వాత అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో నిర్మలకు తీవ్ర గాయాలు కాగా... ముగ్గురు చిన్నారులకు స్వల్ప గాయాలయ్యాయి. బాధితులను చికిత్స కోసం హైదరాబాదుకు తరలించారు. ఘటనా స్థలిని నాగారం సీఐ రవీందర్, ఎస్ఐ లింగంలు పరిశీలించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News