AP NGO's: ఏపీ ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డికే జేఏసీ పగ్గాలు

  • ఆనవాయితీని కొనసాగించిన ఉద్యోగులు
  • అశోక్‌బాబు స్వచ్ఛంద పదవీ విరమణ చేయడంతో ఖాళీ
  • డిప్యూటీ సెక్రటరీ జనరల్‌గా బండి శ్రీనివాస్‌

ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డికే ఏపీ ఉద్యోగుల జేఏసీ పగ్గాలు కూడా కట్టబెట్టి ఆనవాయితీని కొనసాగించారు. విజయవాడలోని ఏపీ ఎన్జీవో కార్యాలయంలో సమావేశమైన ఏపీ జేఏసీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ చంద్రశేఖర్‌రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఇప్పటి వరకు ఈ రెండు పదవులు నిర్వహించిన పి.అశోక్‌బాబు స్వచ్ఛంద పదవీ విరమణ చేయడంతో రెండు స్థానాలు ఒకేసారి ఖాళీ అయ్యాయి. దీంతో ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఇటీవలే ఎన్నికైన చంద్రశేఖర్‌రెడ్డికే ఆనవాయితీగా జేఏసీ బాధ్యతలు కూడా అప్పగించారు.

AP NGO's
JAC Chairman
chandrashekarreddy
  • Loading...

More Telugu News