Congress: కాంగ్రెస్ తరఫున కరీనా కపూర్ పోటీ.. విమర్శలు ఎక్కుపెట్టిన బీజేపీ!

  • భోపాల్ లోక్ సభ స్థానికి కరీనా పేరు సిఫార్సు
  • బీజేపీకి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ నేతల ప్లాన్
  • కుటుంబ నేపథ్యం కలిసి వస్తుందని వివరణ

త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ గట్టి పట్టుదలతో ఉంది. ఇటీవల మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్ గఢ్ లో బీజేపీని మట్టి కరిపించిన హస్తం పార్టీ.. అదే జోరును లోక్ సభ ఎన్నికల్లోనూ కొనసాగించాలని కోరుకుంటోంది. ఇందులో భాగంగా సెలబ్రిటీలను రంగంలోకి దించాలని నిర్ణయించింది. తాజాగా మధ్యప్రదేశ్ లోని భోపాల్ లోక్ సభ స్థానం నుంచి బాలీవుడ్ నటి కరీనా కపూర్ ను పోటీకి దించాలని కాంగ్రెస్ నేతలు యోచిస్తున్నట్లు సమాచారం.

బీజేపీకి కంచుకోటగా ఉన్న భోపాల్ ను దక్కించుకోవాలంటే కరీనా లాంటి సెలబ్రిటీని పోటీకి దించకతప్పదని కాంగ్రెస్‌ నాయకులు గుడ్డు చౌహాన్‌, ఆనీస్‌ ఖాన్‌ పార్టీ హైకమాండ్ కు వివరించినట్లు తెలుస్తోంది. అభిమానగణంతో పాటు భర్త సైఫ్ అలీఖాన్ తాత ఒకప్పుడు భోపాల్ నవాబ్ గా పనిచేశారు. ఈ విషయాలన్నీ కలిసి పనిచేస్తే కాంగ్రెస్ కు విజయం తథ్యమని నేతలు భావిస్తున్నారు. మరోవైపు బీజేపీని ఎదుర్కొనే గట్టి నేతలు ఎవ్వరూ లేకపోవడంతోనే కాంగ్రెస్ నేతలు ఇప్పుడు కరీనాను పోటీకి దించాలని చూస్తున్నారని కమలనాథులు విమర్శించారు.

Congress
BJP
Lok Sabha
2019 elelctions
criticise
bhopal seat
  • Loading...

More Telugu News