YSRCP: కేసీఆర్‌కు జగన్ బకరాలా దొరికాడు: సీపీఐ రామకృష్ణ

  • మోదీ డైరెక్షన్‌లో కేసీఆర్
  • కేసీఆర్ డైరెక్షన్‌లో జగన్
  • ప్రత్యేక హోదాపై టీఆర్ఎస్ ద్వంద్వ వైఖరి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వైసీపీ అధినేత వైఎస్ జగన్ బకరాలా దొరికాడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ కోసమే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ రాగం అందుకున్నారని ఆరోపించారు. ఒంగోలులోని సీపీఐ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. మోదీ డైరెక్షన్‌లో కేసీఆర్.. ఆయన డైరెక్షన్‌లో జగన్ నడుస్తున్నారని విమర్శించారు.

బీజేపీకి వ్యతిరేకంగా దేశ్యవ్యాప్తంగా అన్ని పార్టీలు ఏకం కావాల్సి ఉందని రామకృష్ణ పేర్కొన్నారు. ప్రధాని మోదీకి ఉపయోగపడేలా ఫెడరల్ ఫ్రంట్ కోసం ప్రయత్నిస్తున్న కేసీఆర్ ఆ పని మానుకోవాలని సూచించారు. ఫెడరల్ ఫ్రంట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఫ్రంట్‌తో కలిసి వచ్చేందుకు ఎవరూ సిద్ధంగా లేరన్న రామకృష్ణ.. దేశ ప్రయోజనాల కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఏపీకి ప్రత్యేక హోదాపై టీఆర్ఎస్ నేతలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబును ఓడించకపోతే రాష్ట్రం ప్రమాదంలో పడడం ఖాయమని రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు.

YSRCP
Jagan
KCR
Narendra Modi
CPI Ramakrishna
Andhra Pradesh
  • Loading...

More Telugu News