Keerthi: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • ఆ విషయం తెలుసంటున్న కీర్తి 
  • పోసాని దర్శకత్వంలో వైఎస్ జగన్ బయోపిక్ 
  • త్వరలో సెట్స్ పైకి 'మన్మథుడు 2'
  • పోలీసాఫీసర్ పాత్రలో రజనీకాంత్

*  ఓ నటిగా తానేం చేయాలో తనకు బాగా తెలుసని అంటోంది కథానాయిక కీర్తి సురేశ్. "ఒక సీన్ లో ఎలా నటించాలో నాకు తెలుసు. నా నుంచి ఎలాంటి నటన రాబట్టుకోవాలో నా దర్శకుడికి తెలుసు. మా ఇద్దరి మధ్య మంచి సమన్వయం వుంటుంది. అలాంటప్పుడే కదా, ఏ పాత్ర అయినా బాగా పండుతుంది" అని చెప్పింది.
*  తెలుగులో మరో జీవితకథ తెరకెక్కనుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితకథను తెరకెక్కించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వైసీపీ మద్దతుదారు, ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడట.
*  నాగార్జున కెరీర్లో 'మన్మథుడు' చిత్రం ఓ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా నిలిచింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ చేయడానికి రంగం సిద్ధమైంది. రాహుల్ రవీంద్రన్ దీనికి దర్శకత్వం వహిస్తాడు. త్వరలో షూటింగును ప్రారంభించుకునే ఈ చిత్రం తొలి షెడ్యూల్ పోర్చుగల్ లో జరుగుతుంది.
*  'పేట' సినిమాతో మరో విజయాన్ని పొందిన సూపర్ స్టార్ రజనీకాంత్ తన తదుపరి చిత్రాన్ని మురుగదాస్ దర్శకత్వంలో చేస్తున్నారు. ఇందులో ఆయన పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తారట . 

Keerthi
Jagan
Posani Krishna Murali
Nagarjuna
Rajanikanth
  • Loading...

More Telugu News