Vangaveeti Radha krishna: రంగా కుటుంబాన్ని జగన్ మోసం చేశారు: మండిపడిన రాధా-రంగా మిత్రమండలి

  • వైసీపీకి వంగవీటి రాధా రాజీనామా 
  • రాధాను వదులుకుని జగన్ పెద్ద తప్పే చేస్తున్నారని విమర్శ 
  • రాధా వెంటే ఉంటామన్న కార్పొరేటర్లు 

వంగవీటి రాధాకృష్ణ వ్యవహారంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యవహరించిన తీరుపై రాధా-రంగా మిత్రమండలి  ఆగ్రహం వ్యక్తం చేసింది. మాట తప్పనన్న జగన్.. రంగా కుటుంబాన్ని మోసం చేశారని ఆరోపించింది. రాధాను వదులుకుని జగన్ పెద్ద తప్పే చేస్తున్నారని హెచ్చరించింది. రాధా ఎటువంటి నిర్ణయం తీసుకున్నా తామంతా ఆయన వెంటే ఉంటామని పలువురు కార్పొరేటర్లు, రంగా అభిమానులు తెలిపారు.

కాగా, గత కొంతకాలంగా పార్టీ తీరుపై అసంతృప్తిగా ఉన్న రాధాకృష్ణ ఆదివారం వైసీపీకి రాజీనామా ప్రకటించి కలకలం రేపారు. రాజీనామా లేఖను పార్టీ చీఫ్ జగన్‌కు పంపారు. విజయవాడ సెంట్రల్ టికెట్ విషయంలోనే అధినేతతో ఆయనకు విభేదాలు వచ్చినట్టు తెలుస్తోంది. కాగా, అభిమానులతో చర్చించి మరో రెండు రోజుల్లో తన భవిష్యత్ కార్యాచరణను వివరిస్తానని రాధా తెలిపారు.

Vangaveeti Radha krishna
Vijayawada
YSRCP
Jagan
Andhra Pradesh
  • Loading...

More Telugu News