vangaveeti: మా వాళ్లతో చర్చించి రెండు రోజుల్లో చెబుతా: 'టీడీపీలో చేరికపై' వంగవీటి రాధా

  • వైసీపీకి రాజీనామా చేసిన రాధాకృష్ణ 
  • మా వాళ్లందరితో చర్చించాలి
  • రాజకీయాల్లోనే కొనసాగుతా

వైసీపీకి మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రెండు రోజుల తర్వాత భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని చెప్పారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని తాను ఎన్నడూ చెప్పలేదని... రాజకీయాల్లోనే కొనసాగుతానని తెలిపారు. తన వారందరితో చర్చించి రెండు రోజుల తర్వాత మీడియా ముందుకు వస్తానని చెప్పారు. టీడీపీలో చేరుతున్నారనే ప్రచారం జరుగుతోందంటూ మీడియా ప్రశ్నించగా... అన్ని విషయాలను రెండు రోజుల తర్వాతే వెల్లడిస్తానని అన్నారు. అప్పటి వరకు మీడియా తనకు సహకరించాలని కోరారు.

vangaveeti
radha
ysrcp
Telugudesam
  • Loading...

More Telugu News