Jagga Reddy: చంద్రబాబు సీఎం అయితేనే.. ఏపీకి మంచి జరుగుతుంది: జగ్గారెడ్డి

  • చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు
  • మెదక్ నుంచి రాహుల్ పోటీ చేయాలి
  • కేసీఆర్ ఇప్పుడు హోదా అడగటమేంటి?

సీఎం చంద్రబాబు విజన్ కలిగిన నాయకుడని.. ఏపీ అభివృద్ధి ఆయనతోనే సాధ్యమని ప్రజలు బలంగా నమ్ముతున్నారని.. సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. నేడు ఆయన అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు సీఎం అయితేనే ఏపీకి మంచి జరుగుతుందని.. మరోసారి ఆయన సీఎం పీఠాన్ని అధిరోహించడం ఖాయమని అన్నారు.

ఏపీలో టీడీపీ, తెలంగాణలో కాంగ్రెస్ బతికితేనే ప్రజలకు మంచిదని జగ్గారెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ అభివృద్ధి వెనుక చంద్రబాబు కృషి చాలా ఉందన్నారు. మెదక్ నుంచి రాహుల్ పోటీ చేయాలని కోరుకుంటున్నానని.. ఆయన పోటీ చేస్తే.. ప్రత్యర్థిగా కేసీఆర్ పోటీ చేసినా బంపర్ మెజారిటీతో గెలుపొందటం ఖాయమని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ప్రజలు కోరుకున్న తెలంగాణను కాంగ్రెస్ పార్టీయే ఇచ్చిందని తెలిపారు. అప్పుడు హోదా అడగని కేసీఆర్.. ఇప్పుడు అడగటమేంటని జగ్గారెడ్డి ధ్వజమెత్తారు.

Jagga Reddy
Chandrababu
KCR
Congress
Rahul Gandhi
Telangana
  • Loading...

More Telugu News