mega: మెగా ఫ్యామిలీ కొత్త హీరో ఎంట్రీ రేపే!

  • తెరంగేట్రం చేస్తున్న వైష్ణవ్ తేజ్
  • మొదటి సినిమా లాంచ్ రేపే
  • దర్శకత్వం వహిస్తున్న బుచ్చిబాబు

ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి ఎందరో హీరోలు సినీ పరిశ్రమకు వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి తర్వాత పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్, కల్యాణ్ దేవ్ లు ఇండస్ట్రీకి వచ్చారు. వీరితో పాటు నాగబాబు కూడా కూడా పలు చిత్రాల్లో నటించారు. తాజాగా మరో మెగా హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. చిరు మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ తెరంగేట్రం చేయబోతున్నాడు.

ఇతని మొదటి సినిమా రేపు లాంచ్ కాబోతోంది. ఈ కార్యక్రమానికి మెగా హీరోలు దాదాపుగా హాజరవుతారని చెబుతున్నారు. సుకుమార్ వద్ద అసిస్టెంట్ గా పని చేసిన బుచ్చిబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్ కలసి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 

mega
hero
vaishnav tej
film
launch
tollywood
  • Loading...

More Telugu News